తమిళనాడులో మరో కొత్త పార్టీ... అమ్మ మక్కల్ మునేట్ర కజగం... దినకరన్ స్థాపన

15-03-2018 Thu 12:50 | National
  • ఇకపై తమిళనాడులో అన్ని ఎన్నికల్లోనూ తమదే విజయమని ప్రకటన
  • రెండాకుల గుర్తును సాధించేందుకు పోరాటం చేస్తాం
  • అప్పటి వరకు కుక్కర్ గుర్తుపైనే పోటీ
  • మధురైలోప్రకటించిన దినకరన్
తమిళనాడులో మరో కొత్త పార్టీ అవతరించింది. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు టీటీవీ దినకరన్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. అమ్మ మక్కల్ మునేట్ర కజగం పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. మధురైలో జరిగిన సభలో ఈ మేరకు ప్రకటించారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, శశికళ ఫొటోలను పార్టీ బ్యానర్ పై చోటు కల్పించారు. దివంగత జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో ఇటీవలే దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన పార్టీలో అమ్మ పేరు చేర్చడం ద్వారా ఆయన వ్యూహాత్మకంగా అడుగు వేశారు. కొత్త పార్టీ, జెండాతో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ తాము విజయం సాధిస్తామని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. రెండు ఆకుల గుర్తు సాధించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. అప్పటి వరకు కుక్కర్ గుర్తుపైనే పోటీ చేస్తామని ప్రకటించారు.
tamilnaduttv dinakarannew party

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more